సగం ధరకే శ్రీవారి లడ్డూ

శ్రీవారి దర్శనం ఎప్పటినుంచో ఇప్పుడే చెప్పలేను.. వైవీ సుబ్బారెడ్డి

Tirupati Laddu
Tirupati Laddu

తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూలను సగం ధరకే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీవారి దర్శనభాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అంతవరకు లడ్డూ ప్రసాదాన్నైనా అందుబాటులోకి తీసుకురావాలని పలువురు భక్తులు విజ్ఞప్తి చేశారన్నారు. వీరి కోరిక మేరకు రాష్ట్రంలోని టీటీడీ కల్యాణ మండపాలతోపాటు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని సమాచార కేంద్రాల్లో లడ్డూలను విక్రయానికి ఉంచుతామన్నారు. రూ.50 లడ్డూను రూ.25కే విక్రయిస్తామన్నారు. వేల సంఖ్యలో లడ్డూలు కావాలన్నా ముందస్తు బుకింగ్‌ ద్వారా సరఫరా చేస్తామని ప్రకటించారు.

ఈ హుండీ ద్వారా స్వామివారికి వస్తున్న ఆదాయం పెరిగిందని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి, గత సంవత్సరం ఏప్రిల్ లో రూ. 1.79 కోట్లు రాగా, ఈ సంవత్సరం రూ. 1.97 కోట్ల ఆదాయం కానుకల రూపంగా వచ్చిందన్నారు. టీటీడీలో నిధుల కొరత ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసిన ఆయన, ఆలయాల నిర్వహణకు, ఉద్యోగుల వేతనాలకు ఎలాంటి కొరతా లేదని, స్వామి అనుగ్రహంతో భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి రాబోదన్న నమ్మకం ఉందని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/