శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala
Tirumala

తిరుమల: టిటిడి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు విడుదల చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68,466 టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 6,516 సేవా టికెట్లు, సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2300 టికెట్లను విడుదల చేసినట్టు టిటిడి అధికారులు తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లను కూడా విడుదల చేసినట్టు వారు వెల్లడించారు. విశేష పూజకు 2500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్ సేవ 4350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17400 టికెట్లను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/