శ్రీవారికి ఆన్‌లైన్‌‌లో భక్తుల కానుకలు

టీటీడీ వెబ్‌సైట్, గోవిందం యాప్ ద్వారా కానుకలు

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: కరోనా వైరస్‌ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే కానుకలు సమర్పించడంలో భక్తులు వెనక్కి తగ్గడం లేదు. ఆన్‌లైన్ ద్వారా, గోవిందం యాప్ ద్వారా తోచినంతగా హుండీకి సమర్పించుకుంటున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ హుండీకి రూ. 90 లక్షల కానుకలు జమకాగా, కరోనా వైరస్ సంక్షోభంలో ఉన్నప్పటికీ గత నెలలో కూడా అంతే మొత్తం కానుకలు రావడం విశేషమని అధికారులు చెబుతున్నారు. కాగా, కరోనా వైరస్‌కు జాగ్రత్తలు తీసుకుంటూనే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ ఆలోచిస్తుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/