తిరుమల వెంకన్నకు ఎన్నారై భారీ విరాళం!

Lord :Sri Venkateswara Swamy
Lord :Sri Venkateswara Swamy

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి తనలోని భక్తిని చాటుకుంటూ, నిత్యాన్నదాన పథకానికి కోటీ నూటపదహారు రూపాయల విరాళాన్ని ఇచ్చాడో ప్రవాస భారతీయుడు. ఈ మేరకు విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఎమ్ శ్రీనివాస రెడ్డి అనే దాత అందించగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి స్వయంగా అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డితో తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు, అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో అవిశ్రాంతంగా సాగే నిత్యాన్నదానానికి తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విరాళాన్ని అందించినట్టు ఆయన తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/