విజయవాడలో దారుణం

భార్య తలనరికాడు
కాలువలో పడేసి పోలీసులకు లొంగిపోయిన భర్త

MURDER
MURDER

విజయవాడ: సత్యనారాయణపురం సమీపంలోని శ్రీనగర్‌ కాలనీలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా తలనరికి తలతోరోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఐదేళ్ల కిందట ప్రదీప్‌ అనే వ్యక్తికి మణిక్రాంతి అను ఆమెతో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య వివాదాలు రావడంతో వీరువిడిపోయారు. భార్య భర్తలిద్దరూ చట్టబద్దంగా విడిపోవాలని అనుకు న్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు.
అయితే వీరి కేసుపై కోర్టులో వాదనలు జరుగు తున్నాయి. త్వరలోనే కేసు విచారణ ముగియ నుంది. దీంతో ఆమెపై భర్త పగపెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. ప్రస్తుతం ప్రదీప్‌ భార్య మణిక్రాంతి విజయవాడ సత్యనారాయణ పురంలో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటికివెళ్లి అత్యంత కిరాతకంగా హత మార్చాడు. రోడ్డుపై జనాలు భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టడం, పెద్దపెద్దగా కేకలు వేయడంతో తలను బుడమేరులో పడేశాడు. అక్కడి నుండి తిన్నగా నడుచుకుంటూ వెళ్లి సత్య నారాయణపురం పోలీస్‌ స్టేషన్లో లొంగిపో యాడు. పోలీసుల కేసు నమోదు చేసి పూర్తి వివరాలను రాబడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/