అంతా సులువుగా మూడు రాజధానులు ఏర్పడవు

చిన్న రాష్ట్రమైన ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదు

J. C. Diwakar Reddy
J. C. Diwakar Reddy

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనుకున్నంత సులువులుగా మూడు ఏర్పడవని టిడిపి నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం లేదని జేసీ స్పష్టం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ తీర్పును గౌరవించాల్సిందే కానీ కేంద్రం, కోర్టులున్నాయన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం తీరుపై కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉందని తెలిపారు. కాగా అమరావతి నిర్మాణానికి వరద ముప్పులేదని, ఎగువన చాలా ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. రాజధాని ప్రకటన సమాచారం ఎలాగైనా బయటకు వస్తుందని, ప్రకటన తెలిసినవాళ్లు తాళిబొట్లు సైతం అమ్మి ఎకరా, అర ఎకరం కొన్నారని అన్నారు. అంతమాత్రానా అవినీతి జరిగిపోయినట్లు కాదని జేసీ వ్యాఖ్యానించారు. హైకోర్టు రాయలసీమకు రావడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని జేసీ అన్నారు. జిల్లాకో కియా లాంటి పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేస్తే చాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/