సమరయోధుల త్యాగాలే ఆంధ్రరాష్ట్ర అవతరణకు స్ఫూర్తి

Potti Sri Ramulu, Telugu Talli

అప్పట్లో తెలుగు ప్రజలు మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉండేవారు. ఆ ప్రాంత జనాభాలో దాదాపు నలభై శాతానికిపైగా ఆంధ్రులు విస్తీర్ణంలో 60శాతం ఉండేవారు. ఇంత సంఖ్యలో ఉన్నప్పటికీ ఆంధ్రులను తమిళులు తక్కువ చేసి చూసేవారు. రాష్ట్ర రాజకీయాలలో కానీ విధానపరమైన నిర్ణయా లలో కానీ తమిళుల చేత అవహేళనకు గురవ్ఞతున్నామన్న భావన తెలుగువారిలో మొదలైంది. 1911 సంవత్సరంలో ఒకపక్క స్వాతంత్య్రకాంక్ష, మరోపక్క ప్రత్యేకరాష్ట్ర చర్చ ఊపందుకుంది. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను బలపరి చాయి.

తమిళులలో మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్త మయింది. పట్టాభిసీతారామయ్య మాత్రం ఆంధ్రప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకా కుండా దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలని సూచించారు. 1938లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పడే అవకాశాల గురించి తెలియచేశారు. 1940 లో, 1942లో ఆంధ్రనాయకులు సమైక్య తెలుగు రాష్ట్రం గురించి ఆశాభావాలను వివిధ సందర్భాలలో వ్యక్తం చేశారు. స్వాతంత్య్రో ద్యమం బలంగా ఉండటం వల్ల నాయకుల అస్తిత్వ పోరాటాల వల్ల తెలుగు ప్రజలలో వాంఛ బలంగా ఉన్నప్పటికీ ఏదీ కార్య రూపం దాల్చలేదు.

ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల పోరా టాల ఫలితంగా 1947లో భారతదేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం, హైదరాబాద్‌ సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. అది వీలుగాక పాకిస్థాన్‌లో కలపడానికి ఉత్సాహం ప్రదర్శిస్తుంటే అప్పటి హోం శాఖమంత్రి సర్దార్‌ వల్లభా§్‌ుపటేల్‌ సైనిక చర్యతో హైదరాబాద్‌ 1948లో భారత దేశంలో విలీనం చేసి, హైదరాబాద్‌ రాష్ట్రంగా ఏర్పరచడమైనది.

తర్వాతి కాలంలో గాంధేయవాది అయిన పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరు 19 నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర డిమాండ్‌తో మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. 50 రోజుల నిరహారదీక్ష తర్వాత మద్రాసును వదులుకొంటే ఆంధ్రరాష్ట్ర నిర్మాణం సాధ్యపడుతుందని ప్రధాని నెహ్రూ ప్రకటిం చారు. పొట్టిశ్రీరాములు అందుకు అంగీకరించకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి డిసెంబర్‌ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నా రు. ఆయన ఆత్మార్పణ తరువాత ఆంధ్రప్రాంత జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది.మద్రాసు నగరాన్ని మినహాయించి మద్రాసు రాష్ట్రంలోని తెలుగుజిల్లాల్లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తా మని ప్రధాని నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు.

ఆర్థికపరమైన, పాలనాపరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని విభజన ప్రక్రి యలో అవసరమైన సిఫారసులు చేయ డానికి జస్టిస్‌ కైలాసనాథ్‌ వాంచూను ప్రత్యేకాధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వాంచూ నివేదిక ప్రకారం ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును 1953 మార్చి 25న నెహ్రూ ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో రాయలసీమ శాసనసభ్యులు రాజధాని విషయంలో శ్రీబాగ్‌ ఒడం బడికను పాటించాలని కోరారు. ఆచార్యరంగా నాయకత్వంలోని కృషిక్‌ లోక్‌పార్టీ తిరుపతిని ఆంధ్రరాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు. కమ్యూనిస్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు. ఇన్ని సందిగ్దాల మధ్య చివరకు కర్నూలును ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానిగా అందరూ ఒప్పు కున్నారు.

గుంటూరులో హైకోర్టును,కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు.హైదరాబాద్‌ సంస్థానం విమోచన తర్వాత సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి. తెలుగు ప్రజలకోరికపై 1956, నవంబరు 1న హైదరా బాద్‌ను రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రం లో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైద రాబాద్‌ రాజధానిగా అవతరించింది.

ఈ విధంగా మొట్టమొదటి భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అయింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆంధ్రప్రదేశ్‌ అసలైన బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటేగతంలోలాగానే నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకో వాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పాత విధానం ప్రకారం నవంబర్‌ 1న నిర్వహించా లని ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఏదో ఒక రోజు ఆంధ్ర అవతరణ దినోత్సవం అంటే దానివల్ల ఏదో జరుగుతుందని కాదు. అది ఒక సంస్కృతి. అది మన పూర్వీకులకు మనం ఇచ్చే గౌరవం. తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడానికి, ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోయే కాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అన్ని జిల్లాల్లో, మండ లాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో ఆయా సంస్థ లలో ఈ ఉత్సవం జరిగేలా చేసి తద్వారా ప్రజలలో, విద్యార్థుల లో కూడా ఒక స్ఫూర్తిని నింప డానికి ఈ అవతరణ దినోత్సవా న్ని వాడుకుంటే బాగుంటుంది. తద్వారా మన సాహిత్యం, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వేడుకలు తదితర అంశాలకు గొప్ప గౌరవం ఇచ్చినట్లు అవ్ఞతుంది.

  • కాళంరాజువేణుగోపాల్‌

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/