అరుదైన ప్రతిభాశాలి గొల్లపూడి

nara lokesh
nara lokesh

అమరావతి: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల టిడిపి నేత ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా గొల్లపూడి రచయిత, నటుడిగా సినిమా, రేడియో, నాటక రంగాలలో రాణించడమే కాకుండా..వ్యాసకర్తగా, వక్తగా, విశ్లేషకునిగా ఒక ఉత్తమ సమాజ కోసం తపించిన గొప్ప వ్యక్తి అని నారా లోకేష్‌ తెలిపారు. అటువంటి అరుదైన ప్రతిభాశాలి మరణం బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/