అమ్మఒడికి డబ్బులేస్తూ..నాన్న జేబుకు చిల్లు పెట్టారు!

ముఖ్యమంత్రి జగన్‌కు మహిళా సమస్యలు పట్టడం లేదు

vangalapudi anitha
vangalapudi anitha

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి మహిళా సమస్యలు పట్టడం లేదని టిడిపి నేత తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అమ్మఒడికి డబ్బులేస్తూ నాన్న జేబుకు ప్రభుత్వం చిల్లు పెడుతోందని అనిత విమర్శించారు. అమ్మఒడి పథకం అమల్లో అన్నీ అవకతవలేనన్నారు. అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు ఇచ్చి వెయ్యి తిరిగి ఇవ్వమనడమేంటని ప్రశ్నించారు. యానిమేటర్లకు జీతాలు లేవని, అర్హులైన వృద్ధులకు ఫించన్లు అందడం లేదన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని, వైఎస్సార్‌సిపి అధికారంలో వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దిశా అమల్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. దిశా చట్టామా? పథకమా? ఏంటనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/