ఏపిలో పటచోట్ల పిడుగులు పడే అవకాలు

lightning
lightning

అమరావతి: ఏపిలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహ శా హెచ్చరించింది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖపట్టణం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సూచించింది. ప్రకాశం జిల్లాలోని కుంబం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచెర్ల, కొమరోలులో పిడుగులు పడనున్నాయని తెలిపింది. ఇక కర్నూలు జిల్లాలో వెలిగండ్ల, బండిఆత్మకూరు, మహానంది, కొత్తపల్లి లో పిడుగులు పడొచ్చని స్పష్టంచేసింది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శాంతిపురంలో పిడుగులు పడతాయని వెల్లడించింది. విశాఖపట్టణం జిల్లా లో నర్సీపట్టణం, గోలుగొండ, రోలుగుంట, జి.కె. వీధి, మాడుగుల, చింతపల్లి, జి.మాడుగుల, అనంతగిరిలో పిడుగులు పడతాయని హెచ్చరించింది. రాష్ట్ర ప్రజలంతా కూడా జాగ్రత్తంగా ఉండాలని, సురక్షితమైన భవానల్లో ఉండాలని కొరింది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/