ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనమండలి రద్దు అవ్వదు

kesineni nani
kesineni nani

అమరావతి: శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో టిడిపి ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనమండలి రద్దు అవ్వదు సీఎం జగన్‌ రెడ్డి గారు అని విమర్శించారు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్లే అవకాశం లేదని అన్నారు. ఇటువంటి తీర్మానాలను తప్పుబడుతూ రాజ్యసభ స్థాయి సంఘం ఓ నివేదిక సమర్పించిందని, దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయశాఖ మళ్లీ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాన్ని చేపట్టి పార్లమెంట్‌కు పంపదని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/