రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు

సీఎం జగన్‌ నియమించిన కమిటీ ఆయన ఆలోచనల మేరకే నివేదిక ఇస్తుంది

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ విమర్శలు గుప్పించారు. స్టేక్‌ హోల్డర్స్‌ ఆమోదం లేకండా ఇష్టం వచ్చినట్లు రాజధాని మార్చే అధికారం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి లేదన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌ నియమించిన కమిటీ ఆయన ఆలోచనల మేరకే నివేదిక ఇస్తుందని కన్నా లక్ష్మీనారయణ విమర్శించారు. రాజధాని అంశంపై బిజెపిలో భిన్నాభిప్రాయాలు లేవని, తాము స్పష్టంగా ఉన్నామని చెప్పారు. రాజధాని వ్యవహరంపై రాష్ట్రం ప్రభుత్వం తీరుపై బిజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని, అయితే ఏదైనా అడిగితే మాత్రం సలహాలు, సూచనలు ఇస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలనేది మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. గతంలో పార్టీలన్నీ కలిసి అమరావతి మద్దతిచ్చాయని కన్నా లక్ష్మీనారయణ గుర్తు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/