సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి లేదు

Gopalakrishna
Gopalakrishna

అమరావతి : నేడు సునీతారెడ్డి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘనికి నివేదిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆమె కోరినట్లు స్పష్టంచేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారన్నారు. అలాగే సిట్ దర్యాప్తుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో ఈసీ, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరతామని పేర్కొన్నారు.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: