కేంద్రమే ఆదుకోవాలి

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి ‘బుగ్గన’

AP Finance Minister Buggana Rajendranath
AP Finance Minister Buggana Rajendranath

Amaravati: కరోనాతో లాక్‌ డౌన్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

40వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. కోవిడ్‌ ప్రభావంతో ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రం నుంచి ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ పీయూష్‌ కుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నారు.

ఎప్పుడు లేని విధంగా కరోనా ప్రభావంతో రాష్ట్రం సుమారు 45 శాతం ఆదాయాన్ని కోల్పోయి నట్లు తెలిపారు. అన్ని విధాలా ఆదాయన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలన్నారు.

జీఎస్టీ రిటర్న్‌ల దాఖలకు అదనపు సమయం పెంచడంతో పాటు రాష్ట్రాలకు చెల్లించాల్సిన నష్ట పరిహారానికి సంబంధించిన వివిధ అంశాలను వీరిరువురూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కరోనాతో వ్యాపారాలు ఆగిపోవడంతో సకాలంలో పన్నులు చెల్లించేవారు తగ్గిపోయారని పేర్కొ న్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/