అమరావతి నుంచి రాజధాని మారే ప్రసక్తే లేదు

ఇవాళ ఎవరు కోరారని రాజధాని మారుస్తున్నారు

ayyanna patrudu
ayyanna patrudu

విశాఖపట్టణం: అమరావతి నుంచి రాజధాని మారే ప్రసక్తే లేదని టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాజధాని గురించి మేనిఫేస్టోలో ఎక్కడా చెప్పకుండా..ఇవాళ ఎవరు కోరారని రాజధాని మారుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను నిలదీశారు. అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్‌ విశాఖలో ఉంటే పరిపాలన సజావుగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం, ఒకే నినాదం అని చెప్పారు. కావాలంటే విశాఖలోనే సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ పెట్టాలని సూచించారు. రాజధాని విశాఖకు వస్తే అమరావతిలో ఉన్న ఉద్యోగులు ఇక్కడకు వస్తారే తప్ప పెద్దగా మార్పేమీ ఉండదన్నారు. నిజంగా విశాఖను అభివృద్ధి చేయ్యాలనుకుంటే పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా ఇప్పుడు మూడు రాజధానులకు మద్ధతు పలుకుతున్న మంత్రి బొత్సకు ..గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదా? ప్రశ్నించారు. వైఎస్సార్‌సిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/