ఆ పార్టీలకు దూరంగా ఉండాలన్నదే బిజెపి విధానం

సీఎం జగన్‌ భేటీ పాలనాపరమైన అంశం కావోచ్చు!

kanna laxminarayana
kanna laxminarayana

అమరావతి: టిడిపి, వైఎస్సార్‌సిపి పార్టీలకు సమాన దూరం పాటించాలన్నదే తమ పార్టీ విధానమని ఆంధ్రప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయి చర్చించిన అంశాలు పాలనాపరమైనవే అయి ఉండవచ్చువనని, అంతకు మించి ఏమీ ఉండదన్నది తన అభిప్రాయమని కన్నా తెలిపారు. ఈ రోజు ఆయన మీడియా మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంలో వైఎస్సార్‌సిపి చేరబోతుందన్న అంశంపై రాష్ట్ర నాయకత్వంగా తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/