పోలీసులతో రాజధాని రైతుల వాగ్వాదం

ఇంకా ఎన్ని సార్లు కేసులు పెడతారని ఆగ్రహం

Tension again in Mandadam
Tension again in Mandadam

అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ… రైతులు చేపట్టిన ఆందోళనలు 65వ రోజు ఉద్రిక్తంగా మారాయి. గురువారం ఉదయం మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెంలోని రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. (నిన్న) బుధవారం కృష్ణాయపాలెంలోని ఇళ్ల స్థలాల కోసం భూముల సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు 426 మంది రైతులపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ… మందడం దీక్షా శిబిరం ఎదుట రైతులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను శుభ్రం చేస్తూ రైతులు నిరసన తెలిపారు. రోడ్డును ఖాళీ చేయాలంటూ అక్కడికి చేరుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎన్ని సార్లు కేసులు పెడతారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో మందడం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/