ఖగ్గల్‌లో ఉద్రిక్తత, తిక్కారెడ్డికి గాయం

KHAGGAL
KHAGGAL


కర్నూల్‌: లోక్‌సభ ఎన్నికల్లో మంత్రాలయం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిక్కారెడ్డి శనివారం ఉదయం ఆ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఖగ్గల్‌ వెళ్లారు.. ప్రారంభం నుంచి వైఎస్‌ఆర్‌సిపికి పట్టున్న ఖగ్గల్‌లో టిడిపి జెండా ఆవిష్కరించడానికి తిక్కా రెడ్డి సహా పలువురు కార్యకర్తలు ప్రయత్నించగా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్‌ రెడ్డి గ్రామస్థులతో కలిసి అడ్డుకుని ఘర్షణకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో తిక్కా రెడ్డి గన్‌ మాన్‌ గాల్లోకి కాల్పులు జరపగా ప్రమాదవశాత్తు తిక్కా రెడ్డి ఎడమ కాలికి, మాధవపురం ఎఎస్‌ఐ వేణుగోపాల్‌ కుడి కాలికి బులెట్‌ తగిలింది. వెంటనే వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.