తెలంగాణ హైకోర్టులో సిఎం జగన్‌ పిటిషన్‌పై విచారణ

విచారణను వాయిదా వేసిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం

AP CM Jagan
AP CM Jagan

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలని ఏపి ముఖ్యమంత్రి జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. కాగా దానిపై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఇదివరకే తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టును కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయవల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ మొదలై, ఇరు వాదనలు జరిగాయి. అయితే కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు గాను సిబిఐ అధికారులు మరికొంత గడువు కోరడంతో హైకోర్టు దానికి అంగీకరించింది. ఈ కారణంగా ఏపి సిఎం జగన్‌ పిటిషన్‌ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో ఏపి ముఖ్యమంత్రి జగన్‌ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని సిబిఐ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తరపు న్యాయవాది సిఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ ఈ పిటిషన్‌ లో పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/