తెలంగాణకు 79 , ఆంధ్రాకు 69.346 టీఎంసీలు

Nagarjuna sagar Dam

Hyderabad: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణాకు, ఏపీకి నీటి కేటాయింపులు జరిపింది. తెలంగాణాకు 79 టీఎంసీలు, ఆంధ్రాకు 69 .346 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణాకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 15 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 45 టీఎంసీలు కేటాయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం రెండు టీఎంసీలు కేటాయించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/