ఉరవకొండ నుంచి టిడిపి అభ్యర్ధి పయ్యావుల గెలుపు

payyavula keshav
payyavula keshav

అమరావతి: అనంతపురం జిల్లాలో ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు. ఇవాళ ఉదయం ఆ ఫలితాన్ని వెల్లడించారు. ఉరవకొండలో ఈవిఎంలో సమస్యలు తలెత్తడంతో కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యమైంది. ఐతే ఇవాళ ఉదయం 5 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డిపై కేశవ్‌ 2132 ఓట్ల తేడాతో నెగ్గారు. ఉరవకొండ నుంచి ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదన్న సెంటిమెంటు ఉంది. అది ఇప్పుడు వర్కౌట్‌ అయింది.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/