125 సీట్లతో మళ్లీ టిడిపినే

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

విశాఖ: రాష్ట్ర ప్రజలంతా కూడా మళ్లీ పనిచేసే ప్రభుత్వానికే పట్టంకట్టబోతున్నారని, 125 సీట్లతో టిడిపి గెలవబోతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37 వార్డు 209 బూత్‌లో అర్ధరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. అధికారులను మార్చి రాష్ట్రంలో భయాన్ని సృష్టించారని ఆరోపించారు. పోలింగ్ రోజు ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమన్నారు. ఏర్పాట్లలో లోపాలపై స్వయంగా ఎన్నికల కమిషనర్ ఒప్పుకున్నారని తెలిపారు. భద్రత ఇవ్వలేకపోయామని.. ఓట్లు గల్లంతు నిజమేనని ద్వివేది ఒప్పుకున్నారని వెల్లడించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/