140 సీట్లతో వార్‌ వన్‌ సైడ్‌

maganti babu
maganti babu


పశ్చిమగోదావరి: టిడిపి పార్టీకి 101 సీట్లు రావడం ఖాయమని ఆ పార్టీ ఎంపి మాగంటి బాబు అన్నారు. ఇక మహిళలు, పింఛనుదారులు ఓట్లతో 140 సీట్లు సాధించి ఎన్నికలు వన్‌ సైడ్‌ అని నిరూపిస్తామని ధీమ వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ నేమ్‌ ప్లేట్‌ తయారు చేసుకుని కుర్చీ ఎక్కడానికి కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. సియం కుర్చీ అంటే మామూలు విషయం కాదని, అదేమైనా మ్యూజికల్‌ ఛైరా ఆడుకోవడానికి? అని ప్రశ్నించారు. ఏ నాయకుడైనా రెండు పార్టీలు మాత్రమే మారే విధంగా చట్టం రావాలని ఆకాంక్షించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/