నేడు ఏపిలో నిరసనలకు టిడిపి పిలుపు

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గ్రామ/ మండల కేంద్రాలలో హౌసింగ్ పెండింగ్ బిల్లులు, ఇళ్లు స్వాధీనం చేయకపోవడంపై.. టిడిపి హయాంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. టిడిపి శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. అమరావతి ఆందోళనలు మొదలై 200 రోజులైన సందర్భంగా రాజధాని రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి టిడిపి మద్దతు పలికింది. రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు అందరికీ చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అమరావతి దేవేంద్రుడి రాజధాని అనీ… అటువంటి మహోన్నత చరిత్ర అమరావతికి ఉందనీ అన్నారు. అమరావతిని చంపాలని కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి మోడి అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/