టిడిటి సీనియర్‌ నాయకుడు శివప్రసాద్‌కు అస్వస్థత

TDP MP Naramalli Sivaprasad
TDP MP Naramalli Sivaprasad

చిత్తూరు: మాజీ ఎంపి, సినీ నటుడు, టిడిపి సీనియర్‌ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. స్వతహాగా సినీ నటుడైన శివప్రసాద్‌ తన విలక్షణ శైలి, విచిత్ర వేషధారణలతో ఎంపీగా ఉండగా నిత్యం వార్తల్లో ఉండేవారు. ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, అంబేడ్కర్..ఇలా రోజుకో వేషంతో పార్లమెంటు ముందు నిలబడి పలు పార్టీ నాయకులను విశేషంగా ఆకట్టుకునే వారు. చిత్తూరు నుంచి 2009, 2014లో రెండు సార్లు టీడీపీ తరపున గెలిచిన ఆయన గత ఎన్నికల్లో ఇదే స్థానంలో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. శివప్రసాద్‌ అనారోగ్యం సమాచారం అందడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయన చేరిన ఆసుపత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/