ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతల ఆందాళన

tdp
tdp

తిరుపతి: ఈసీ నిర్ణయంపై పులువురు టిడిపి నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అయితే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్ని ఈసీ నిర్ణయంపై వారు వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారి పల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ చంద్రగిరి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన ఎన్నికల అధికారులు భారత ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఈసీఐ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైకాపా ఫిర్యాదు చేస్తే ముందూ..వెనుక ఆలోచించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని మండిపడ్డారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/