ఇందుకు కాదు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది

శాసనమండలి రద్దు నిర్ణయంపై ఎంపి కేశినేని ట్వీట్‌

Kesineni Nani
Kesineni Nani

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు నిర్ణయంపై పలువురు టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మండలిని రద్దు చేస్తానని సిఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై టిడిపి ఎంపి కేశినేని నాని ట్విట్టర్‌లో స్పందించారు. జగనన్న మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించింది 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవడానికి కాదు. దమ్ముగా పోరాడతావని, ఇంత పిరికి వాడివి అని అనుకోలేదు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా శాసనమండలి రద్దు నిర్ణయానికి ఏపి కేబినేట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ అంశంపై కేబినేట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనిని అసెంబ్లీలో ప్రస్తావించారు కూడా.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/