కెసిఆర్‌కు ఇక్కడేం పని?

Kanakamedala Ravindrakumar
Kanakamedala Ravindrakumar

అమరావతి: తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ఏపి రాజకీయాలో జోక్యం ఎందుకు ఆయనకు ఇక్కడ ఓట్లు, సీట్లు లేవు మరి ఆయనకు ఇక్కడేం పని అని టిడిపి ఎంపి కన్కమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. సిఎం కావలే కోరిక కోసంమే వైఎస్‌ఆర్‌సిపి పుట్టిందే తప్ప ఆ పార్టీకి సిద్దాంతాలేమి లేవని ఆయన విమర్శించారు. పోలవరం ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కెసిఆర్‌ వెనక్కి తీసుకుంటారా?అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక హోదా ఇస్తారని నమ్మి మోసపోయామని చెప్పారు. నదుల అనుసంధానం, పోలవరం, పట్టిసీమపై జగన్‌ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. మోడి డైరక్షన్‌లో జగన్‌, కెసిఆర్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/