ఏపి పోలీసులపై గల్లా సంచలన ఆరోపణలు

Jayadev Galla
Jayadev Galla

అమరావతి: ఏపి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టైన టిడిపి ఎంపి గల్లా జయదేవ్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం మధ్యాహ్నం జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఏపి పోలీసులపై ఎంపి గల్లా జయదేవ్ సంచలన ఆరోపణలు చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. లాఠీ ఛార్జీ చేస్తే తూళ్లూరు మహిళలు తనను కాపాడారని ఆయన చెప్పారు. పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని.. చొక్కా చింపి గోళ్లతో రక్కారని ఆరోపించారు గల్లా. ఎస్పీ లాఠీ పట్టుకొని బెదిరించారని.. వాళ్లు కొడతారేమోనని భయపడ్డానని చెప్పారు గల్లా జయదేవ్. 15 గంటల పాటు తిప్పారని.. వైద్యం కావాలని అడిగినా వినిపించుకోలేదని మండిపడ్డారు గల్లా. పోలీసులు గిచ్చుతున్నారంటే ఏంటో అనుకున్నానని….ఇప్పుడు బాగా తెలిసిందని చెప్పారు. ఒక ఎంపికే ఇలా జరిగితే సామన్యుడి పరిస్థితి ఏంటని ఏపీ ప్రభుత్వం, పోలీసులపై గల్లా జయదేవ్ విమర్శలు గుప్పించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/