వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన టిడిపి ఎమ్మెల్యే కుమారులు

వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు పలికిన వాసుపల్లి గణేశ్

tdp-mla-sons-joined-ysrcp

అమరావతి: ఏపి సిఎం జగన్‌ను విశాఖ సౌత్‌ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ తన కుమారులతో కలిశారు. జగన్‌ ను కలిసిన వాసుపల్లి గణేశ్ వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు పలికారు. సిఎం జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వాసుపల్లి తనయులు సూర్య, గోవింద్ సాకేత్ ఇద్దరూ వైఎస్‌ఆర్‌సిపి కండువాలు కప్పుకున్నారు. ఈ సమయంలో వైఎస్‌ఆర్‌సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గణేష్.. తన కుమారులు వైఎస్‌ఆర్‌సిపి చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/