సీఎం జగన్‌ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..

ganta srinivasa rao
ganta srinivasa rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్న సీఎం జగన్‌ ప్రకటనను టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు స్వాగతించారు. విశాఖ పట్టణాన్ని శాసన సభలో పరిపాలనా నగరంగా మార్చే అవకాశముందన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలకు ఆయన స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సహజ సిద్ధమైన సముద్ర తీరం గల నగరం విశాఖాను పరిపాలనా రాజధానిగా చేయడం మంచి నిర్ణయమని అన్నారు. రోడ్‌, రైల్‌, ఎయిర్‌, వాటర్‌ కనెక్టివిటీతో రాజధానిగా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశాఖ విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖయామన్నారు. అందుకు విశాఖ ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/