గంటా శ్రీనివాస్‌రావుతో భేటీ అయిన బిజెపి ఎమ్మెల్సీ

Somu Veerraju
Somu Veerraju

విశాఖపట్టణం: టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు విశాఖపట్నంలో ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావుతో ఇవాళ విశాఖలో సమావేశమైనట్లు చెప్పిన ఆయన …త్వరలోనే తమ బలం మరింత పెరగబోతోందన్నారు. అనంతరం మీడియాతో మట్లాడిన సోము వీర్రాజు ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు సహా, పలువురు నేతలు బిజెపిలో చేరే అవకాశముందని చెప్పారు. కాగా బిజెపి ఎదుగుదలలో ఇదొక అంకం మాత్రమే రాబోయే రోజుల్లో శాసనసభలో భారతీయ జనతాపార్టీకి మంచి స్థాయి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ జడ్పీటీసీ సభ్యులు బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్‌లో 2024లో బిజెపినే రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా బలపడుతుందని అధికారం చేపట్టేదిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/