నేటి నుండి మహానాడు కార్యక్రమం

కార్యకర్తలు పాల్గొనాలన్న చంద్రబాబునాయుడు

tdp-mahanadu

అమరావతి: టిడిపి వార్షిక మహానాడు సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఇవి జరుగనున్నాయి. అయితే ఈసారి లాక్‌డౌన్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కొద్ది మంది ముఖ్యులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇందులో పాల్గొంటారు. లాక్ డౌన్ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ, డిజిటల్ సోషలైజేషన్ దిశగా సాగుతున్నామని, ఈ సంవత్సరం జరుగుతున్న డిజిటల్ మహానాడు కూడా అటువంటిదేనని చంద్రబాబు తెలిపారు. ప్రతి సంవత్సరమూ అసంఖ్యాకంగా వచ్చే నేతలు, కార్యకర్తల మధ్య సాగే మహానాడుకు ఈ సంవత్సరం నిబంధనలు అడ్డుగా నిలిచాయని అన్నారు. జూమ్ తమకు కొత్త మార్గాన్ని చూపిందన్నారు. ఇండియాలోనే తొలిసారిగా ఓ రాజకీయ సమావేశం డిజిటల్ మాధ్యమంగా సాగుతోందని వ్యాఖ్యానించిన ఆయన, టిడిపికి చెందిన వారంతా తమ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో జూమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/