గవర్నర్‌కు జగన్‌ ప్రభుత్వంపై టిడిపి నేతల ఫిర్యాదు

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

అమరావతి: టిడిపి పార్టీ నేతలు ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కలిసారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడంపై ఫిర్యాదు చేశారు. బిశ్వభూషణ్‌ ను రాజ్‌ భవన్‌ లో కలిసిన పార్టీ నేతలు కేశినేని నాని, అచ్చెన్నాయుడు, గద్దె రామారావు తదితరులు నాలుగు పేజీల లేఖను అందించారు. డ్రోన్ ఎగురవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు భద్రతను తగ్గించిన జగన్ ప్రభుత్వం, హైకోర్టు కల్పించుకున్న తరువాతే తిరిగి పునరుద్ధరించిందని గుర్తు చేశారు. వైసీపీ రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాగా, అంతకుముందు కృష్ణానది వరదతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/