ప్రజలు ఛీ కొట్టేలా తెలుగుదేశం సభ్యుల తీరు: రోజా

Roja

అమరావతి. అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు ఛీకోట్టేలా ఉందని వైఎస్సార్సీ వెమ్మెల్యే ఎపిఐఐసి చైర్మన్‌ అర్కే రోజా నిప్పులుచేరిగారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ముందు మాట్లాడన అమె, గత శాసనసభలో జరిగిన ఏ అంశాన్నీ ప్రజలింకా మరచిపోలేదని వ్యాఖ్యానించారు. తమను రౌడీలని, గూండాలని బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయని కావాలంటే వాటి క్లిప్పింగ్స్‌ వేసి చూపిస్తామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు సభా సంద్రదాయలకు గురించి మాట్లాడుతూ ఉండటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తాను ఓ మహిళా ఎమ్మెల్యేనన్న గౌరవం కూడా ఇవ్వకుండా గత అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ఎలా మాట్లాడారన్న రికార్డులు ఉన్నాయని అన్నారు. అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రమంతా అసహ్యించుకుంటోందని రోజా నిప్పులు చేరిగారు. గత ఐదేళ్ల పాలన ప్రజలకు నచ్చలేదు కాబట్టే ప్రజలు జగన్‌కు అధికారాన్ని ఇచ్చారని, ఓటమి కారణంగా వచ్చిన ఫ్రస్టెషన్‌ నుంచి ఇంకా బయటపడలేని తెలుగుదేశం నేతలు, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ సభలో సమయాన్ని వృథా చేస్తున్నారని అరోపించారు. తమ ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ, సభలో సమయాన్ని వృథా చేస్తున్నారని అరోపించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విమర్శించే దారి కనిపించకనే మాట్లాడాల్సిన చంద్రబాబు తన గదికి పారిపోయి, మైక్‌ను బుచ్చయ్య చౌదరికి అప్పగించారని రోజా ఎద్దేవా చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/andhra-pradesh/