వాహనం దగ్ధం కేసులో తెదేపా నేతల అరెస్ట్

Arrest
Arrest

kadapa: పులివెందులలో వాహనం దగ్ధం కేసులో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెదేపా నేతలు మధుసూదన్ రెడ్డి, మహబూబ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల క్రితం పులివెందుల తెదేపా కార్యాలయంలో వాహనం దగ్ధమైనట్లు ఫిర్యాదు చేశారు. తెదేపా నేతలే వాహనాన్ని దహనం చేశారని విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అరెస్టుకు నిరసనగా  పీఎస్ వద్ద తెదేపా నేతల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/