రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు

పాలన వికేంద్రీకరణ రద్దుకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది

varla ramaiah
varla ramaiah

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏపిలో మూడు రాజధానుల బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ వద్దకు పంపిన నేపథ్యంలో ఈవిషయంపై టిడిపి నేత వర్ల రామయ్య సిఎం జగన్‌కు పట్టుదలకు పోకుండా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలంటూ సూచనలు చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ.. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది. దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు. అవునా?’ అని వర్ల రామయ్య సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/