కొల్లు రవీంద్ర గృహనిర్బంధం

TDP Leader Kollu Ravindra House Arrest
TDP Leader Kollu Ravindra House Arrest

Vijayawada: టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. చలో ఆత్మకూరుకు బయల్దేరకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. చలో ఆత్మకూరుకు బయల్దేరిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. విజయవాడలో చలో ఆత్మకూరుకు బయల్దేరిన టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. చలో ఆత్మకూరును అడ్డుకుంటున్న పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వివాదానికి దిగుతున్నారు.