అలాంటి చట్టాలు తెస్తే చెల్లుబాటు కావు

ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా?.. దేవినేని ఉమ

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: టిడిపి నేత నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ‘నేల తల్లిపై మమకారాన్ని చంపుకొని 29 వేల రైతు కుటుంబాలు 34 వేల ఎకరాల భూములిస్తే అన్యాయం చేస్తారా? ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా? రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోని అంశాలు. అలాంటి చట్టాలు తెస్తే చెల్లుబాటు కావు, కార్యాలయాలు తరలిస్తే మిగిలేది శూన్యమంటున్న రైతుల మాటలు వినబడుతున్నాయా వైఎస్ జగన్ గారు?’ అని ప్రశ్నించారు.

మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి అందులో ఉంది. ఏపిలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో యథాతథ స్థితి పాటించాలని ఆదేశించిందని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఉంది. అదే విధంగా రాజధాని తరలింపునకు సంబంధించిన పిటిషన్లనన్నింటినీ ప్రస్తుత పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని నిర్దేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు అందులో ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/