రహస్య ప్రదేశానికి చింతమనేని

TDP Leaser Chintamaneni Prabhakar
TDP Leaser Chintamaneni Prabhakar

Eluru: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. అట్రాసిటీ కేసులో చింతమనేనిను అరెస్ట్‌ చేశారు. తనపై ఉన్న కేసుల కారణంగా చింతమనేని 12 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.