టిడిపికి మరో షాక్‌

Sanyasi Patrudu
Sanyasi Patrudu

అమరావతి: టిడిపికి మరో షాక్ తగిలింది. విశాఖ టిడిపి లో 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన భార్య అనితతో కలిసి వైఎస్‌ఆర్‌సిపి తీర్థం పుచ్చుకోనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి. అవి ఇటీవలి కాలంలో మరింత తీవ్రతరం కావడంతో సన్యాసిపాత్రుడు, ఆయన భార్య అనిత
వైఎస్‌ఆర్‌సిపి లో చేరబోతున్నారని తెలుస్తోంది. నేడు నారా లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలోనే సన్యాసి పాత్రుడు టిడిపికి గుడ్ బై చెప్పనుండటం గమనార్హం.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/