కాకినాడ‌లో టిడిపి ఎమ్మెల్యేల ర‌హ‌స్య స‌మావేశం

TDP
TDP

కాకినాడ: టిడిపికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. కాకినాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో సమావేశమైనట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది టిడిపి నేతలు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. టిడిపిను వీడి బిజెపి లేదా వైఎస్ఆర్‌సిపిలో చేరే విషయమై వీరంతా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్‌, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు, పంచకర్ల రమేశ్‌బాబు, ఈలి నాని ఈ సమావేశానికి హాజరయ్యారు. టిడిపికు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు భాజపాలో చేరనున్నారనే వార్తలపైనా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు తాము టిడిపిను వీడేది లేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపైనే తామంతా విశ్లేషించామని చెప్పారు. 

తాజా క్రీడా వార్త‌ల‌ కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/