రీపోలింగ్‌ పెట్టాలని సిఎం డిమాండ్‌

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈవీఎంల మొరాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు స్తంభించిన ప్రాంతాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 శాతం ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్ని చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంలు సరిగా లేక టిడిపికి వేసే ఓట్లు వైఎస్‌ఆర్‌సిపికి పడుతున్నయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ త్వరగతిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవీఎంలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు తెలిపారు. అయితే ఈవీఎంల మొరాయింపు వల్ల సుమారు మూడు గంటల ఓటింగ్‌ సమయం వృధా అయ్యిందని చంద్రబాబు సీఈఓ గోపాల కృష్ట ద్వివేదికి ఫిర్యాదు చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/