విశాఖ ఘటనపై చంద్రబాబు దిగ్బ్రాంతి

భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్

chandrababu naidu
chandrababu naidu

విశాఖ: హిందూస్థాన్ షిప్ యార్డులో ఓ భారీ క్రేన్ కూలి  ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోందని, వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మధ్యాహ్నం విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో క్రేన్ కింద నలిగిపోయి పలువురు మృత్యువాత పడ్డారు. క్రేన్ కింద ఇంకా కొందరు ఉన్నట్టు భావిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/