ఇది విధ్వంసక ప్రభుత్వం

ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదు

Chandrababu
Chandrababu

కర్నూలు: టిడిపి అధినేత చంద్రబాబు కర్నూలులో టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపిలో అరాచకపాలన, దున్నపోతు పాలన నడుస్తోందని ఆయన అన్నారు. ఇది విధ్వంసక ప్రభుత్వం తప్ప, ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదని విమర్శించారు. తమపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. అనవసరంగా రెచ్చిపోయి తమపై కేసులు బనాయించొద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. తమ హయాంలో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లాలో ఒక తట్ట మట్టి తీశారా? ఒక యూనిట్ పని చేశారా? అని ప్రశ్నించారు. ఎప్పటికైనా సరే రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలని, దీని కోసం ప్రభుత్వం పని చేస్తే తాము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/