ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ

balakrishna
balakrishna

అనంతపురం: టిడిపి అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందుపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు సొంత నియోజకవర్గంలో ఓటు వేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఓటు అనేది ఐదేళ్లకు ఒకసారి అవకాశం వస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యలో ఓటర్లు తమ అభిష్టం మేరకు ఓటు వేయాలన్నారు. వాళ్లకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/