నారా లోకేష్‌కు టిడిపి కార్యకర్తల ఫిర్యాదు

Nara Lokesh
Nara Lokesh

గుంటూరు: టిడిపి నేత నారా లోకేష్‌ను ముట్లూరు గ్రామ టిడిపి కార్యకర్తలు కలిసారు. ఎన్నికల్లో టిడిపికి మద్దతు తెలిపినందుకు 60 ఎస్సీ కుటంబాలపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. 180 మందిని గ్రామాల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లొ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ లోకేష్‌ ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ స్పందిస్తూ గ్రామానికి పార్టీ తరపున ఓ కమిటీని త్వరలోనే పంపిస్తామని హామీ ఇచ్చారు. కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ చేసే న్యాయపోరాటానికి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని టిడిపి పార్టీ మీకు అండగా ఉంటుందని లోకేష్‌ హామీ ఇచ్చారు..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/