ఎమ్మెల్యెలకు చంద్రబాబు దిశానిర్దేశం

ap cm chandrababu
chandrababu

అమరావతి: టిడిపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతు కొత్త ఎన్నికైన ఎమ్మెల్యెలకు సభలో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రజల కోపం వల్ల మనం ఓటమి చెందలేదు. జగన్‌ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేశాం. కాలంతో పరిగెత్తాం, అనేక పనులు చేశాం. సమర్ధ నీటినిర్వహణతో నీటి కొరతను అధిగమించాం. అని అన్నారు. కానీ, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. అయినా 39.2శాతం ఓట్లు రాబట్టాం. ఏదేమైనా కొంతకాలం వేచి చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏంచేస్తుందో చూద్దాం. అన్నింటినీ నిశితంగా గమనిద్దాం, ఆతర్వాతే స్పందిద్దాం. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా అందరూ గతంలో పనిచేసినవారే. పాత, కొత్త కలబోతతో తెలుగుదేశం వాణిని బలంగా వినిపించాలి. ఆయా నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలి. సకాలంలో పరిష్కారమయ్యేలా శ్రద్ధ వహించాలి అని చంద్రబాబు సూచించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/