ఏపి అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం!

tammineni seetharam
tammineni seetharam


అమరావతి: ఏపి అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటి స్పీకర్‌గా పీడిక రాజన్న దొరను నియమించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరూ ఏపి సియం జగన్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం నుంచి తమ్మినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నెల 12 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/