చంద్రబాబును కలిసిన టి-టిడిపి నేతలు

 Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబును తెలంగాణ టిడిపి నేతలు ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయను కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపిలో టిడిపి పరాజయం గురించి నేతలు ప్రస్తావించినట్టు సమాచారం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని వారితో చంద్రబాబు అన్నట్టు సమాచారం. చంద్రబాబును కలిసిన వారిలో ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/